విడుదల తేదీ : 19 ఏప్రిల్ 2013
TeluguWorld.wap.sh : 4/5
దర్శకుడు : విజయ్ కుమార్ కొండ
నిర్మాత : నికిత రెడ్డి – విక్రం గౌడ్
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : నితిన్, నిత్యా మీనన్, ఇషా తల్వార్, అలీ
యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా ఈ రోజు ప్రపంచమంతటా విడుదలైంది. ఈ సినిమాలో నితిన్ సరసన నిత్యా మీనన్, ఇషా తల్వార్ లు హీరోయిన్స్ గా నటించారు. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. ‘ఇష్క్’ లాంటి హిట్ సినిమా తర్వాత వస్తున్నా ఈ సినిమా నితిన్ కెరీర్ కి చాలా కీలకం కానుంది. ఇప్పడు ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
‘గుండెజారి గల్లంతయ్యిందే’ స్టొరీ చాలా సింపుల్ గా ఉంది కానీ మంచి సినిమా. తనకినచ్చినట్టు లైఫ్ ని గడుపుతూ స్వతంత్ర భావాలు కలిగిన కుర్రాడు కార్తీక్ (నితిన్). ఏదైనా తనకు కావాలనుకుంటే దాని సాదించే మనస్తత్వం కలవాడు. కార్తీక్ తన ఫ్రెండ్ పండు (అలీ) పెళ్ళికి వెళ్తాడు. అక్కడ శృతి(ఇషా తల్వార్)ని చూసి తనతో ప్రేమలో పడతాడు. పండు ద్వారా ఆమె ఫోన్ నెంబర్ ను కనుక్కొని రెగ్యులర్ గా ఆమెకు ఫోన్ చేస్తూ వుంటాడు. కానీ అతని దురదృష్టం అది తప్పు ఫోన్ నెంబర్ కావడంతో కార్తీక్ శృతి అనుకొని శ్రావణి (నిత్యా మీనన్ )కి ఫోన్ చేస్తూ వుంటాడు. శ్రావణి ఒక పెద్దింటి అమ్మాయి. శ్రావణికి ఎవరో తెలియని వ్యక్తిని ప్రేమించాలనే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తన బ్యూటీ, స్టేటస్ చూడకుండా తన భావాలు నచ్చి తనని ప్రేమించే వారి కోసం చూస్తుంటుంది. ఆమె అనుకున్న అన్నింటినీ కార్తీక్ రీచ్ అవడంతో ఆమె కల నిజమైందని సంతోషిస్తుంది. అలా ఫోన్ లో మొదలైన వారిద్దరి రొమాన్స్ కాస్తా ప్రేమగా మారుతుంది. ఇలా వేరువేరు కారణాలతో కార్తీక్ మరియు శ్రావణిల ప్రేమ ఎక్కువకాలం నిలువదు. వారిద్దరూ ఒకరినొకరు కలుసుకోవాలని నిర్ణయించుకోవడంతో కథలో ఓ ట్విస్ట్. ఆ తర్వాత ఏం జరిగింది? కార్తీక్ చివరికి ఎవరిని ప్రేమించాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
నితిన్ కార్తీక్ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ‘ఇష్క్’ సినిమా నుండి నితిన్ నటన, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో నితిన్ కాస్ట్యూమ్స్, స్క్రీన్ పై నటన బాగున్నాయి. రీమిక్స్ చేసిన పవన్ కళ్యాణ్ పాటలో నితిన్ డాన్సులు చాలా బాగున్నాయి. టెక్నికల్ గా పవన్ కళ్యాణ్, నితిన్ కలిసి డాన్స్ చేసినట్టు చూపించిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలోనితిన్ చేసిన కామెడీ, టైమింగ్ బాగుంది.నిత్యా మీనన్ మరోసారి ఈ సినిమాలో చాలా చక్కగా కనిపించింది. ఆమె పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నాయి వాటన్నిటినీ బాగా చూపించింది. నిత్యా మీనన్ కళ్ళ తో భావాలను బాగా పలికిస్తుంది ఇందులో కూడా ఎమోషినల్ సీన్స్ లో బాగా చేసింది. ఆమె పెర్ఫామెన్స్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. నితిన్, నిత్యా మీనన్ ల మద్య కెమిస్ట్రీ చాలా సూపర్బ్ గా ఉంది మరియు అది ఈ సినిమాకి మేజర్ హైలైట్. వీరిద్దరి పై రాసుకున్న సీన్స్ ని చాలా బాగా చిత్రీకరించారు.
నితిన్, నిత్యా మీనన్ ల మద్య రొమాంటిక్ సన్నివేశాలను చాలా డెప్త్ గా తెరకెక్కించారు. వేరిద్దరి మధ్య కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా చాలా బాగున్నాయి. ఇషా తల్వార్ చాలా డీసెంట్ గా కనిపించింది. నితిన్ ఫ్రెండ్ గా అలీ నటన బాగుంది. తాగుబోతు రమేష్ తన పాత్రతో అందరిని నవ్వించాడు నితిన్ ఫ్రెండ్ గా మధు నటన బాగుంది. ఇషా తల్వార్ – నితిన్ రొమాంటిక్ ట్రాక్ చాలా కామెడీగా ఉంది. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే , మంచి కామెడీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఈ సినిమా మొదటి నుంచి ఫాస్ట్ గా సాగుతుంది అలాగే సినిమా మొత్తం కామెడీ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. పాటలను చాలా బాగా చిత్రీకరించారు. ప్రత్యేకంగా రీమిక్స్ చేసిన పవన్ కళ్యాణ్ పాట, ‘తుహి రే’ చాలా బాగున్నాయి. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోని ఫేమస్ ‘నడుం’ సీన్ ఈ సినిమాలో చాలా బాగా చిత్రీకరించారు.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ కాస్త వేగం తగ్గింది. సినిమా పరంగా కొన్ని చిన్న చిన్న మైనస్ లు ఉన్నాయి. ఉదాహరణకి మీ పార్టనర్ తో కొన్ని గంటలు ఫోనులో మాట్లాడుతున్నావ్ అదే పార్టనర్ ఎదురుగా వస్తే మీ వాయిస్ గుర్తు పట్టలేదు అంటావా? ఈ సినిమాలో వచ్చే గే కామెడీ సన్నివేశాలను అందరూ ఆస్వాదించ లేకపొతున్నారు – ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. రఘు బాబు చేసిన కామెడీ అనటగా ఆకట్టుకోలేదు, దీనివల్ల ఈ సినిమాకి ఎటువంటి ఉపయోగంలేదు.
సాంకేతికా విబాగం:
ఆండ్రూ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ విజువల్స్ ను చూస్తుంటే ఒక గొప్ప ఫీల్ కలుగుతోంది. ఎడిటింగ్ బాగుంది. డైలాగులు సూపర్బ్. ఇవి ఈ సినిమాకే చాలా ప్లస్ గా చెప్పవచ్చు.
అనూప్ రుబెన్స్ అందించిన సంగీతం చాలా బాగుంది. విజయ్ కుమార్ కొండకి డైరెక్టర్ గా ఈ సినిమా మంచి పేరును తీసుకొస్తుంది. చాలా సింపుల్ స్టోరీలైన్ తో ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీయడంలో సక్సెస్ అయ్యాడు.
తీర్పు :
గుండె జారి గల్లంతయ్యిందే మంచి కథతో, చక్కగా తీసిన ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. నితిన్, నిత్యా మీనన్ లా మద్య కెమిస్ట్రీ సుపర్బ్. సినిమాలోని కామెడీ, ఆకర్షనీయమైన స్క్రీన్ ప్లే ఈ సినిమాని చూస్తున్న వారి దృష్టిని మరల్చకుండా చేస్తాయి. నితిన్ బాక్స్ ఆఫీసు వద్ద మరోసారి విజయాన్ని సాదించనున్నాడు.